బీఆర్‌ఎస్ నాయకులపై అనుచిత వ్యాఖ్యలు సహించం..
గుండుమాల్ tv focus : బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ( KTR ) , మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్‌రెడ్డిపై అనుచిత వ్యాఖ్యలు చేస్తే సహించబోమని బీఆర్‌ఎస్ నాయకులు స్పష్టం చేశారు. నారాయణపేట్ జిల్లా గుండుమాల్ మండల కేంద్రంలో ఆదివారం బీఆర్‌ఎస్ నాయకులు నిర్వహించిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. అనుచిత వ్యాఖ్యలు చేసిన వారిపై వెంటనే క్రిమినల్ కేసులునమోదు చేయాలని డిమాండ్ చేశారు.
⏱ Top Story
👁 7 Views |
⬇️ 0 Downloads