బ్రహ్మోత్సవాల నాటికి సివిల్ ఇంజినీరింగ్ పనులను పూర్తి చేయాలి
తిరుమల 7tv focus : బ్రహ్మోత్సవాలనాటికి భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా సివిల్ ఇంజినీరింగ్ పనులన్నింటినీ వారం రోజుల్లోగా పూర్తి చేయాలని అదనపు ఈవో సి.హెచ్. వెంకయ్య చౌదరి ఆదేశించారు.శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు మరో రెండు వారాల్లో ప్రారంభం కానున్న నేపథ్యంలో తిరుమలలో జరుగుతున్న ఇంజినీరింగ్ పనుల పురోగతిపై ఆయన మంగళవారం తిరుమలలోని సుధర్మ సమావేశ మందిరంలో జరిగిన సమీక్షలో సివిల్, ఎలక్ట్రికల్, వాటర్ వర్క్స్ తదితర విభాగాలకు సంబంధించిన పనుల పురోగతిని పరిశీలించారు.టీటీడీ ఇన్‌చార్జి సీఈ మనోహరం, ఇంజినీరింగ్ పనుల పురోగతిని అదనపు ఈవోకు వివరించారు.
⏱ Top Story
👁 6 Views |
⬇️ 0 Downloads