Police-Vehicle_V_jpg--816x480-3g (1)
7TV Focus News

 బ్రేకులు ఫెయిలై పోలీస్ వాహనం బోల్తా.. 

అమరావతి 7tv focus : ఆంధ్రప్రదేశ్‌లోని విజయనగరం జిల్లాలో పోలీసు వాహనం బ్రేకులు ఫెయిల్‌ అయి బోల్తాపడిన ఘటనలో ఓ కానిస్టేబుల్‌ దుర్మరణంచెందాడు. ఓ కేసు దర్యాప్తు కోసం ప్రభుత్వ వైద్య కళాశాల నుంచి కొండకరకం వెళ్తున్న ఎస్సై అశోక్ కుమార్, కానిస్టేబుళ్లు వెంకటరమణ, నాగేంద్ర, డ్రైవర్ రాజాబాబు పోలీసు వాహనం కొండకరకం వద్ద బ్రేకులు ఫెయిల్ అయి అదుపుతప్పి చెట్టును ఢీకొని బోల్తా పడింది. ఈ ఘటనలో వాహనంలో ఉన్న వారందరూ గాయపడగా, ఆసుపత్రిలో చికిత్స పొందుతూ వెంకట రమణ (49) అనే కానిస్టేబుల్ మృతి చెందాడు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
⏱ Top Story 👁 16 Views | ⬇️ 0 Downloads
⬅️ Back to Read Article