PM-Modi_V_gif--816x480-3g
7TV Focus News

 భార‌త ఆర్థిక‌వ్య‌వ‌స్థ బ‌లంగా పుంజుకుంటోంది..

7tv focus : ప్రపంచవ్యాప్తంగా క్లిష్ట పరిస్థితులు ఉన్నప్పటికీ భారత ఆర్థికవ్యవస్థ బలంగా పుంజుకుంటోందని, దేశంపై అంతర్జాతీయ విశ్వాసం గణనీయంగా పెరిగిందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. సెమీకండక్టర్ , ఫిన్‌టెక్, లాజిస్టిక్స్ వంటి కీలక రంగాల్లో చోటుచేసుకుంటున్న అభివృద్ధి దీనికి నిదర్శనమని ఆయన పేర్కొన్నారు. గురువారం సెమీకాన్ ఇండియా 2026 కార్యక్రమాన్ని ప్రారంభించిన అనంతరం ప్రధాని ప్రసంగించారు. ఈ సందర్భంగా మోదీ మాట్లాడుతూ.. ప్రపంచం గడ్డుకాలాన్ని ఎదుర్కొంటున్నా, ఇటీవలి త్రైమాసికంలో భారత్ 7.8 శాతం ఆర్థికవృద్ధిని నమోదుచేసిందన్నారు. ఇది మన ఆర్థికవ్యవస్థ స్థితిస్థాపకతను చూపుతోందని, గడిచిన 15 రోజుల్లో జరిగిన పరిణామాలే దీనికి ఉదాహరణ అని తెలిపారు. ముంబైలో జరిగిన గ్లోబల్ ఫిన్‌టెక్ ఫెస్ట్‌లో ఏజెంటిక్ ఏఐ, టోకెనైజేషన్, క్వాంటం టెక్నాలజీ...
⏱ Top Story 👁 7 Views | ⬇️ 0 Downloads
⬅️ Back to Read Article