మండలి వెంకట కృష్ణారావు సిద్ధాంతాల ఆదర్శంగా పని చేద్దాం
విజయవాడ7tv: నగరంలోని తుమ్మలపల్లి కళాక్షేత్రంలో మండలి వెంకట కృష్ణారావు శతజయంతి కార్యక్రమం అంగరంగ వైభవంగా జరిగింది. ఈ కార్యక్రమానికి మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మండలి వెంకట కృష్ణారావు కాంస్య విగ్రహాన్ని ఏపీ అసెంబ్లీ స్పీకర్ అయ్యన్నపాత్రుడుతో కలిసి ఆయన ఆవిష్కరించారు. అనంతరం మండలి వెంకట కృష్ణారావు స్మృతికి ఘన నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా దేశానికి, తెలుగు భాషకు ఆయన చేసిన సేవలను మాజీ ఉపరాష్ట్రపతి ప్రశంసించారు. ఈ సందర్భంగా వెంకయ్య నాయుడు మాట్లాడుతూ.. ఏది ప్రారంభించాలన్నా రిబ్బన్ కత్తిరించడం సరికాదన్నారు. అది బ్రిటీష్ వారు నేర్పిన విధానమని చెప్పారు. మన దేశాన్ని, మనల్ని వారు విభజించి వెళ్లారని అన్నారు. ఏదైనా ముడి వేస్తే దానిని...
⏱ Top Story
👁 7 Views |
⬇️ 0 Downloads