WhatsApp Image 2026-11-04 at 6.28.15 PM
7TV Focus News

మంత్రి అడ్లూరిని మర్యాద పూర్వకంగా కలిసిన టీడబ్ల్యూజేఎఫ్ నేతలు

జగిత్యాల, నవంబర్ 04:తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్స్ ఫెడరేషన్(టీడబ్ల్యూజేఎఫ్) రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు మామిడి సోమయ్య, తన్నీరు శ్రీనివాస్ లు రాష్ట్ర మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ను మర్యాద పూర్వకంగా కలిశారు. బుధవారం జగిత్యాల జిల్లాకు వెళ్ళిన ఫెడరేషన్ నాయకులు అక్కడే జిల్లా పర్యటనలో ఉన్న మంత్రిని కలిసి శాలువాతో సత్కరించారు. మంత్రిని కలిసిన వారిలో ఫెడరేషన్ జగిత్యాల జిల్లా ఉపాధ్యక్షు కాసం శ్రీనివాస్ రెడ్డి, మేడ్చల్ జిల్లా కోశాధికారి కొండా సంజీవ కుమార్ తదితరులున్నారు.
⏱ Top Story 👁 12 Views | ⬇️ 0 Downloads
⬅️ Back to Read Article