manipur-army-man-kidnap_V_jpg--816x480-4g
7TV Focus News

మణిపూర్‌లో ప్రత్యర్థి నాగా వర్గాల మధ్య కాల్పులు.. 

7tv focus : మణిపూర్‌లో రెండు ప్రత్యర్థి నాగా వర్గాల మధ్య కాల్పులు జరిగాయి. ఈ కాల్పుల్లో ఇరు వర్గాలకు చెందిన నలుగురు మిలిటెంట్లు మరణించారు. భయాందోళన చెందిన ప్రజలు తమ ఇళ్లను వదిలి పారిపోయారు. మణిపూర్‌లోని నోనీ జిల్లాలో ఈ సంఘటన జరిగింది. బుధవారం తెల్లవారుజామున 3.30 గంటల సమయంలో టావోడైజింగ్ గ్రామంలో నాగా ప్రత్యర్థి వర్గాలైన జెలియాంగ్‌రాంగ్ యునైటెడ్ ఫ్రంట్ (జెంచుయ్ వర్గం) జెడ్‌యూఎఫ్‌(జే), నేషనల్ సోషలిస్ట్ కౌన్సిల్ ఆఫ్ నాగలిమ్ (ఎన్‌ఎస్‌సీఎన్‌-ఐఎం)కు చెందిన మిలిటెంట్ల మధ్య ఘర్షణ జరిగింది. దీంతో పరస్పరం కాల్పులు జరుపుకున్నారు. జెడ్‌యూఎఫ్‌(జే)కు చెందిన ముగ్గురు మిలిటెంట్లు, (ఎన్‌ఎస్‌సీఎన్‌-ఐఎం)కు చెందిన ఒక మిలిటెంట్‌ ఈ కాల్పుల్లో మరణించారు.కాగా, నాగా ప్రత్యర్థి వర్గాల ఘర్షణ, కాల్పులకు గ్రామస్తులు...
⏱ Top Story 👁 6 Views | ⬇️ 0 Downloads
⬅️ Back to Read Article