మధ్యంతర ఎన్నికల్లో ఓడిపోతే మిస్టర్ వీటోగా మారుతా
7tv focus : ఇరాన్ తో యుద్ధం, ప్రపంచ దేశాలతో ఘర్షణల నేపథ్యంలో అమెరికా లో అధికశాతం ప్రజలు అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ను వ్యతిరేకిస్తున్నట్లు పలు సర్వేలు వెల్లడిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ట్రంప్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఒకవేళ మధ్యంతర ఎన్నికల్లో డెమోక్రాట్లు మెజారిటీ సాధిస్తే.. తాను ‘మిస్టర్ వీటో ’ గా మారాల్సి రావచ్చని పేర్కొన్నారు. వారి అధికారాలను నియంత్రించేందుకు వీటో పవర్ను వినియోగిస్తానని చెప్పారు.ఎన్నికల్లో డెమోక్రాట్‌లు గెలిచి కాంగ్రెస్‌పై పట్టు సాధిస్తే వారుచేసే బిల్లులను ఆమోదించకుండా అన్నింటినీ తిరస్కరిస్తానని ట్రంప్ అన్నారు. ఒకటి రెండు నెలలపాటు అలాచేస్తే చివరికి వారే తన దగ్గరికి వచ్చి ఒప్పందం చేసుకోవాలని చూస్తారని, అయితే అవన్నీ వృథా ప్రయత్నాలే అవుతాయని ట్రంప్ అన్నారు....
⏱ Top Story
👁 10 Views |
⬇️ 0 Downloads