మరింత బలపడ్డ తీవ్ర వాయుగుండం.. ఇవాళ సాయంత్రం తుపానుగా మారే అవకాశం!
7tv focus : బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం తీవ్ర వాయుగుండంగా మరింత బలపడింది. ఆగ్నేయ, దానికి ఆనుకుని ఉన్న నైరుతి బంగాళాఖాతంలో ఉత్తర వాయవ్య దిశగా కదలుతోంది. గత ఆరు గంటల్లో గంటకు 8 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించినట్లు భారత వాతావరణ శాఖ (ఐఎండీ) వెల్లడించింది. నవంబర్ 16వ తేదీ ఉదయం 5.30 గంటలకు ఆగ్నేయ, దానికి ఆనుకుని ఉన్న నైరుతి బంగాళాఖాతంలో 11.0 డిగ్రీల ఉత్తర అక్షాంశం, 86.5 డిగ్రీల తూర్పు రేఖాంశం వద్ద ఇది కేంద్రీకృతమై ఉంది. విశాఖకు 820 కిలోమీటర్ల దూరంలో.. ప్రస్తుతం తీవ్ర వాయుగుండం విశాఖపట్నానికి ఆగ్నేయంగా 820 కిలోమీటర్లు, చెన్నైకి తూర్పు ఆగ్నేయంగా 720 కిలోమీటర్లు, ఒడిశాలోని గోపాల్‌పూర్‌కు దక్షిణంగా 940 కిలోమీటర్ల దూరంలో ఉంది....
⏱ Top Story
👁 8 Views |
⬇️ 0 Downloads