images (5)
7TV Focus News

మహబుబాబాద్ జిల్లాలో పెరుగుతున్న మహిళలు, బాలికల అదృశ్య కేసులు

మహబుబాబాద్ 7tv focus : మహబుబాబాద్ జిల్లాలో రోజురోజుకూ మహిళలు, బాలికల మిస్సింగ్‌ కేసులు పెరుగుతున్నాయి. దీంతో వారి తల్లిదండ్రుల్లో తీవ్ర ఆందోళనలు రేకెత్తిస్తున్నాయి. చదువుకోవాల్సిన వయస్సులో ప్రేమ, ఆకర్షణ పేరుతో పోకిరీల మాయమాటల వలలో చిక్కుకుని బాలికలు ఇళ్లు వదిలివెళ్తున్నారు. కన్నవారికి కంటిమీద కునుకు లేకుండా చేస్తూ, అదృశ్యమవుతున్న ఘటనలు జిల్లా వ్యాప్తంగా ఆందోళనను కల్గిస్తున్నాయి. మాయమాటలతో వల.. ప్రస్తుత సాంకేతిక యుగంలో సోషల్‌మీడియా (ఇన్‌స్టాగ్రామ్‌, వాట్సాప్‌, ఫేస్‌బుక్‌) వినియోగం పెరగడంతో కొందరు అల్లరిమూకలు, పోకిరీలు అమాయకపు బాలికలను లక్ష్యంగా చేసుకుంటున్నారు. తియ్యటి మాటలు చెప్తూ, విలాసవంతమైన జీవితాన్ని చూపిస్తూ, ప్రేమపేరుతో ఉచ్చు బిగిస్తున్నారు. ఈ ఆకర్షణకు లోనవుతున్న మైనర్లు, భవిష్యత్తు గురించి ఆలోచించకుండా కన్నపేగును, కష్టపడి పెంచిన తల్లిదండ్రులను వదిలేసి...
⏱ Top Story 👁 18 Views | ⬇️ 0 Downloads
⬅️ Back to Read Article