మా వ్యాపారాలు దెబ్బతింటున్నాయి.. నిరసనలు ఆపండి..
7tv focus : సర్‌కు వ్యతిరేకంగా, సీఈసీ జ్ఞానేష్ కుమర్ రాజీనామా డిమాండ్‌తో ఢిల్లీతోపాటు దేశంలోని అనేక ప్రాంతాల్లో కొద్ది రోజులుగా వరుసగా నిరసనలు జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోదీకి, కాంగ్రెస్ అగ్రనేత, లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీకి, సీజేఐ జస్టిస్ సూర్యకాంత్‌కి దేశంలోని పలు వ్యాపార, వాణిజ్య సంస్థలు, సంఘాలు కీలక విజ్ఞప్తి చేశాయి. ఈ ఆందోళనల వల్ల తమ వ్యాపార, వాణిజ్య కార్యకలాపాలు దెబ్బతింటున్నాయని, అందువల్ల ఆందోళనలు ఆపాలని కోరాయి.వ్యాపార, వాణిజ్య వేత్తలు, కార్మికుల రక్షణ కోసం చర్యలు తీసుకోవాలని లేఖలో కోరాయి. ఇది అసలే పండుగల సీజన్ అని, ఇలాంటి సమయంలో తమ కార్యకలాపాలు దెబ్బతినకుండా చూడాలని విజ్ఞప్తి చేశాయి. అక్టోబర్...
⏱ Top Story
👁 7 Views |
⬇️ 0 Downloads