jagadish-reddy_V_jpg--816x480-3g
7TV Focus News

మిర్యాలగూడలో కేటీఆర్ రైతు సభ నిర్వహించి తీరుతాం

సూర్యాపేట 7tv focus : రాష్ట్రంలో నీటి సమస్యలు తీవ్రంగా మారుతున్నా ప్రభుత్వ పెద్దలు ప్రజా సమస్యలను పట్టించుకోకుండా అవినీతి సొమ్మును లెక్కించే పనిలో ఉన్నారని మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే గుంటకండ్ల జగదీశ్ రెడ్డి ఆరోపించారు. సూర్యాపేటలో నిర్వహించిన ప్రెస్‌మీట్‌లో ఆయన కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు.మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌పై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేస్తున్న వ్యాఖ్యలు ఆయన వ్యక్తిత్వానికి అద్దం పడుతున్నాయని జగదీశ్ రెడ్డి అన్నారు. కేసీఆర్ అంటే అనుక్షణం భయంతోనే రేవంత్ రెడ్డి రోత మాటలు మాట్లాడుతున్నారని విమర్శించారు. కేసీఆర్‌ను ఎక్కువగా గుర్తు చేసుకునే వారిలో రేవంత్ రెడ్డిదే ప్రథమ స్థానమని ఎద్దేవా చేశారు.రాష్ట్ర ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత రేవంత్ రెడ్డి సచివాలయానికి ఎన్నిసార్లు వచ్చారో...
⏱ Top Story 👁 8 Views | ⬇️ 0 Downloads
⬅️ Back to Read Article