Untitled_1_245e0bfa23_V_jpg--625x351-4g
7TV Focus News

మురసు తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో సీఎం ఏరియల్ వ్యూ.. పంటల పరిశీలన

7tv focus : మురసు తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుఈరోజు ఏరియల్ వ్యూ నిర్వహించారు. గుంటూరు, ప్రకాశం, బాపట్ల జిల్లాల్లోని తుఫాన్ ప్రభావిత ప్రాంతాలను పరిశీలించారు. చిలకలూరిపేట, ఒంగోలు, కొత్తపట్నం, చినగంజాం, చీరాల, బాపట్ల ప్రాంతాల్లో మురసు తుఫాన్ నష్టాన్ని ముఖ్యమంత్రి పరిశీలిస్తున్నారు.ఆయా ప్రాంతాల్లో హెలికాప్టర్ ల్యాండ్ కావడానికి అనుకూల వాతావరణం లేకపోవడంతో సీఎం ఏరియల్ వ్యూ ద్వారా పంటలను పరిశీలిస్తున్నారు. ఏరియల్ వ్యూ అనంతరం అమరావతి సచివాలయానికి చేరుకుని ఆర్టీజీఎస్ నుంచి మురసు తుఫాన్ ప్రభావంపై సీఎం చంద్రబాబు సమీక్షా సమావేశం నిర్వహించనున్నారు.
⏱ Top Story 👁 11 Views | ⬇️ 0 Downloads
⬅️ Back to Read Article