మూడేళ్ల కాంగ్రెస్ పాలనపై మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ఫైర్
7tv focus : ఎన్నికల ముందు ఆరు గ్యారెంటీలు, 420 హామీలతో ప్రజలను నమ్మించి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం, మూడేళ్లు గడుస్తున్నా హామీల అమలులో విఫలమైందని మునుగోడు మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి విమర్శించారు. అభయహస్తం పేరుతో ప్రజలకు ఆశలు కల్పించిన కాంగ్రెస్ పాలన నేడు శూన్యహస్తంగా మారిందని ఎద్దేవా చేశారు. రైతులకు రూ.2 లక్షల రుణమాఫీ, ఎకరాకు రూ.15 వేల పెట్టుబడి సాయం, కౌలు రైతులకు ఆర్థిక సహాయం, వరికి రూ.500 బోనస్ వంటి హామీలు పూర్తిస్థాయిలో అమలు కాలేదన్నారు.ధాన్యం కొనుగోళ్లలోనూ ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తోందని, కొనుగోలు కేంద్రాల్లో రైతులు రోజుల తరబడి ఎదురుచూస్తున్నా పట్టించుకునే నాథుడే లేడని ఆరోపించారు. నిరుద్యోగులకు రెండు లక్షల ఉద్యోగాలు, రూ.4 వేల...
⏱ Top Story
👁 8 Views |
⬇️ 0 Downloads