మెగాస్టార్ చిరంజీవి ఓటీటీ ఎంట్రీకి ముహూర్తం ఫిక్స్..
7tv focus : టాలీవుడ్‌లో మెగాస్టార్ చిరంజీవికి ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. దశాబ్దాలుగా తనదైన నటన, డ్యాన్స్, కామెడీ, యాక్షన్‌తో కోట్లాది మంది అభిమానులను అలరిస్తున్న ఆయన.. వెండితెరపై తిరుగులేని స్టార్‌డమ్‌ను సంపాదించుకున్నారు. అయితే ఇన్నేళ్ల సినీ ప్రయాణంలో చిరంజీవి ఓటీటీ ఎంట్రీ కోసం అభిమానులు ఎంతోకాలంగా ఎదురుచూస్తున్నారు. ఎట్టకేలకు ఆ నిరీక్షణకు తెరపడనుంది. మెగాస్టార్ త్వరలోనే ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్‌ఫ్లిక్స్ ద్వారా డిజిటల్ ప్రేక్షకులను పలకరించబోతున్నారు. చిరంజీవి ఓటీటీ ఎంట్రీ కోసం నెట్‌ఫ్లిక్స్ ఓ ప్రత్యేకమైన కార్యక్రమాన్ని సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తోంది. ‘మెగావర్స్’ పేరుతో ఈ టాక్ షోను రూపొందిస్తున్నారు. సాధారణ టాక్ షోలకు భిన్నంగా మెగాస్టార్ స్టైల్, ఆయన మాటతీరు, సినీ అనుభవాలు,...
⏱ Top Story
👁 11 Views |
⬇️ 0 Downloads