మెగాస్టార్ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్.. సైలెంట్‌గా పనులు పూర్తి చేస్తున్న వశిష్ఠ!
7tv focus : మెగాస్టార్ చిరంజీవి హీరోగా తెరకెక్కుతున్న భారీ సోషియో ఫాంటసీ చిత్రం ‘విశ్వంభర’ గురించి గత కొంతకాలంగా రకరకాల వార్తలు వినిపిస్తున్నాయి. బింబిసార ఫేమ్ వశిష్ఠ మల్లిడి దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమాపై మొదట్లో భారీ అంచనాలు ఏర్పడ్డాయి. అయితే షూటింగ్, గ్రాఫిక్స్, ఇతర నిర్మాణానంతర కార్యక్రమాల కారణంగా సినిమా విడుదల ఆలస్యమవుతూ వస్తోంది. ఇప్పటివరకు విడుదల తేదీపై స్పష్టత లేకపోవడంతో మెగా అభిమానుల్లో కొంత నిరాశ నెలకొంది. ఈ నేపథ్యంలో తాజాగా సినిమాకు సంబంధించిన ఓ ఆసక్తికరమైన అప్‌డేట్ బయటకు వచ్చింది. చిత్రంలో నటిస్తున్న నటుడు ప్రవీణ్ కుమార్ సోషల్ మీడియాలో షేర్ చేసిన ఓ ఫొటోతో ‘విశ్వంభర’ పనులు ప్రస్తుతం ఏ దశలో ఉన్నాయో వెల్లడైంది.‘విశ్వంభర’ సినిమా...
⏱ Top Story
👁 12 Views |
⬇️ 0 Downloads