images (1)
7TV Focus News

మొదట ఓట్ చోరీ.. ఇప్పుడు పార్టీ చోరీ

7tv focus : భారత ఎన్నికల సంఘం (ఈసీఐ)పై కాంగ్రెస్ ఎంపీ, లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ తీవ్ర విమర్శలు చేశారు. పశ్చిమ బెంగాల్‌లో వచ్చే నెల 6న జరగనున్న ఉప ఎన్నికల నేపథ్యంలో తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) పార్టీ పేరు, పువ్వులు-గడ్డి గుర్తును ఈసీ తాత్కాలికంగా ఫ్రీజ్ చేయడాన్ని ఆయన తప్పుబట్టారు. ఈ మేరకు శుక్రవారం ఎక్స్‌లో ఆయన పోస్టు చేశారు. ‘మొదట ఓట్లను చోరీ చేశారు. తర్వాత ప్రభుత్వాలను చోరీ చేశారు. ఇప్పుడు పార్టీని దొంగిలిస్తున్నారు’ అని రాహుల్ వ్యాఖ్యానించారు. దేశంలో ప్రజాస్వామ్యం దిగజారిపోతోందనడానికి తాజా పరిణామాలు నిదర్శనమని ఆయన వ్యాఖ్యానించారు. ముందుగా బీజేపీ, ఎన్నికల సంఘం చేతులు కలుపుతాయని, తర్వాత పార్టీల గుర్తులను తొలగిస్తారని ఆయన మండిపడ్డారు....
⏱ Top Story 👁 13 Views | ⬇️ 0 Downloads
⬅️ Back to Read Article