‘యువత మాదక ద్రవ్యాలకు దూరంగా ఉండాలి’
7tv focus : యువత మాదకద్రవ్యాల (డ్రగ్స్) కు దూరంగా ఉండాలని రామన్నపేట ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రధానాచార్యులు సి.జగదీశ్ అన్నారు. శనివారం మారథాన్‌ను జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడుతూ.. మాదకద్రవ్యాల వినియోగం వల్ల యువత ఆరోగ్యం పూర్తిగా దెబ్బతినడమే కాకుండా, భవిష్యత్, కుటుంబాలు రోడ్డున పడతాయన్నారు. విద్యార్థులందరూ మాదక ద్రవ్యాలకు దూరంగా ఉంటామని, సమాజంలో దీనిపై అవగాహన కల్పిస్తామని విద్యార్థులచే ప్రతిజ్ఞ చేయించారు. ప్రభుత్వ జూనియర్ కళాశాల ఆవరణ నుండి గ్రామ పంచాయతీ కార్యాలయం వరకు సాగిన ఈ మినీ మారథాన్‌లో ఎన్.ఎస్.ఎస్ (NSS) విద్యార్థులు, అధ్యాపకులు, పోలీస్ సిబ్బంది, స్థానికులు ఉత్సాహంగా పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో కళాశాల ఎన్.ఎస్.ఎస్ ప్రోగ్రామ్ ఆఫీసర్లు అశోక్...
⏱ Top Story
👁 4 Views |
⬇️ 0 Downloads