రవితేజ ‘ఇరుముడి’ ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో ‘మల్లెపూల పల్లకి’ సాంగ్ లాంచ్!
7tv focus : మాస్ మహారాజా రవితేజ నటిస్తున్న తాజా చిత్రం ‘ఇరుముడి’. శివ నిర్వాణ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలున్నాయి. కాగా, ఈ చిత్రానికి సంబంధించి మేకర్స్ ఒక క్రేజీ అనౌన్స్‌మెంట్ ఇచ్చారు. సినిమా విడుదల తేదీ దగ్గర పడుతుండటంతో చిత్ర యూనిట్ ప్రమోషన్ కార్యక్రమాలను వేగవంతం చేసింది. ఇందులో భాగంగా ఆగస్టు 16న హైదరాబాద్‌లోని శిల్పకళా వేదిక వేదికగా ‘ఇరుముడి’ ప్రీ రిలీజ్ వేడుకను అత్యంత వైభవంగా నిర్వహించనున్నట్లు అధికారికంగా ప్రకటించారు.
⏱ Top Story
👁 8 Views |
⬇️ 0 Downloads