రాప్తాడు బాలిక ఓ ఫైటర్.. త్వరలోనే కోలుకుని వస్తుంది: మంత్రి నారా లోకేశ్
7tv focus : రాప్తాడు బాలిక ఆరోగ్య పరిస్థితిపై మంత్రి నారా లోకేశ్ మణిపాల్ ఆసుపత్రి వైద్యులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా బాలికకు అందిస్తున్న వైద్య చికిత్స, ప్రస్తుతం ఆమె ఆరోగ్య పరిస్థితి, కోలుకుంటున్న తీరు తదితర వివరాలను వైద్యులను అడిగి తెలుసుకున్నారు. బాలికకు మెరుగైన వైద్యం అందించాలని.. ఆమె ఆరోగ్య పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని సూచించారు. బాలిక త్వరలోనే కోలుకుని ఆసుపత్రి నుంచి ఇంటికి చేరుకుంటుందన్న వైద్యుల సమాచారంతో ఆశాభావం వ్యక్తం చేశారు.ఈ సందర్భంగా బాలిక మనోధైర్యాన్ని మంత్రి నారా లోకేశ్ ప్రశంసించారు. ఆమె ఓ ఫైటర్ అని.. అన్ని ఇబ్బందులను అధిగమించి త్వరలోనే సంపూర్ణ ఆరోగ్యంతో తిరిగి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. కేవలం శారీరకంగా కోలుకోవడమే...
⏱ Top Story
👁 5 Views |
⬇️ 0 Downloads