రాష్ట్రంలో కరువు రావాలని కోరుకుంటున్న బీఆర్ఎస్ నేతలు: ఎంపీ చామల
హైదరాబాద్, అక్టోబర్ 26: రాజకీయం చేయాలనే ఆలోచనే తప్పా ప్రజలపై బీఆర్ఎస్ పార్టీ నేతలకు ప్రేమ లేదని భువనగిరి ఎంపీ, కాంగ్రెస్ పార్టీ నేత చామల కిరణ్ కుమార్ రెడ్డి మండిపడ్డారు. తెలంగాణలో కరువు రావాలని ఆ పార్టీ నేతలు కోరుకుంటున్నారని విమర్శించారు. అందుకోసం అబద్ధాలను వారు ప్రచారం చేస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. సోమవారం గాంధీభవన్లో ఆయన విలేకర్లతో మాట్లాడుతూ.. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ దిమాక్ లేని దివానా మాటలు మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్త చేశారు. గడ్డం పెంచి పెద్ద మనిషి అయ్యానని ఆయన అనుకుంటున్నారంటూ వ్యంగ్యంగా అన్నారు. మేడిగడ్డలో నీటిని నిల్వ చేసే పరిస్థితి లేదని పెదవి విరిచారు. ఎల్ నినో నేపథ్యంలో అక్టోబర్ 28వ తేదీన రాష్ట్రంలో...
⏱ Top Story
👁 7 Views |
⬇️ 0 Downloads