రుణాల పేరుతో మహిళలకు రూ.20 లక్షల టోకరా!
7tv focus : రుణాలు ఇప్పిస్తానని నమ్మించి 25 మంది మహిళల వద్ద సుమారు రూ.20 లక్షలు వసూలు చేసిన ఓ ప్రైవేటు బ్యాంకు ఏజెంట్ పరారైన ఘటన ములకలపల్లి మండలంలోని మూకమామిడి పంచాయతీ పరిధి సాయిరాంపురంలో వెలుగుచూసింది. గ్రామానికి గడ్డం వెంకటేష్ ప్రైవేటు బ్యాంకుల ఏజెంట్‌గా పని చేస్తున్నాడు. మహిళలకు బ్యాంకుల ద్వారా రుణాలు ఇప్పిస్తానని, వాటి నెలవారీ వాయిదాలను సైతం తానే చెల్లిస్తానని నమ్మబలికి విడతల వారీగా వారి నుండి డబ్బులు వసూలు చేసినట్లు బాధితులు ఆరోపిస్తున్నారు. ఈ క్రమంలో సుమారు 25 మంది మహిళల నుండి రూ.20 లక్షల వరకు వసూలు చేసి కనిపించకుండా పోయినట్లు తెలిపారు.ఇటీవల సంబంధిత బ్యాంకు సిబ్బంది మహిళల ఇళ్లకు చేరుకుని రుణాల వాయిదాలు...
⏱ Top Story
👁 6 Views |
⬇️ 0 Downloads