రూ. 2.20 కోట్లు కొట్టేసిన సైబర్ కేటుగాళ్లు
7tv focus : ఓ వృద్ధురాలిని డిజిటల్ అరెస్టు చేసి.. రూ.2.20 కోట్లు కొట్టేశారు సైబర్ నేరస్తులు. నాంపల్లికి చెందిన 72 ఏండ్ల వృద్ధురాలికి ఓ వ్యక్తి వీడియోకాల్ చేసి.. సీబీఐ అధికారినని చెప్పుకొన్నాడు. బాధితురాలి పేరుతో అక్రమ మాదకద్రవ్యాలు ఉన్న పార్సిల్ బుక్ అయిందని, ఆమెకు సంబంధించిన బ్యాంకు ఖాతా మనీలాండరింగ్‌లో ఉపయోగించబడిందని చెప్పాడు.నకిలీ అరెస్ట్ వారెంట్ చూపించి ఆమెను అరెస్టు చేస్తామని బెదిరించాడు. భద్రతా డిపాజిట్ల పేరుతో, వివిధ వ్యక్తుల నియంత్రణలో ఉన్న బ్యాంకు ఖాతాలకు అనేకసార్లు డబ్బు బదిలీ చేయాలని సైబర్ నేరస్తులు బలవంతపెట్టారు. దీంతో ఆమె వారు చెప్పిన ఖాతాలకు నగదు బదిలీ చేసింది. బాధితురాలి ఫిర్యాదు మేరకు సైబర్ క్రైమ్ పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.
⏱ Top Story
👁 4 Views |
⬇️ 0 Downloads