ACB-Net_V_jpg--816x480-3g
7TV Focus News

రూ.8వేలు లంచం తీసుకుంటూ ఏసీబీకి పట్టుబడ్డ తహసీల్దార్

7tv focus :  రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ రూరల్ తహసీల్దార్ కార్యాలయంలో ఏసీబీ అధికారులు గురువారం దాడులు చేశారు. తహసీల్దార్ కమ్ జాయింట్ సబ్‌రిజిస్ట్రార్‌గా పనిచేస్తున్న ఎం. అబూబకర్ , భూ భారతి ఆపరేటర్‌గా పనిచేస్తున్న ప్రైవేట్ వ్యక్తి సంకసాల అనిల్ కుమార్ రూ.8,000 లంచం తీసుకుంటుండగా రెడ్‌ హ్యండెడ్‌గా పట్టుకున్నారు.ఫిర్యాదుదారుడి అత్తకు చెందిన వ్యవసాయ భూమిని ఆయన తండ్రి పేరుపై గిఫ్ట్ డీడ్ రిజిస్ట్రేషన్ చేయించేందుకు సహకరించే విషయంలో లంచం డిమాండ్ చేసి, నగదును తీసుకుంటుండగా పట్టుకున్నారు. ఇద్దరిపై కేసు నమోదు చేసి కరీంనగర్‌లోని ఏసీబీ కేసుల ప్రత్యేక న్యాయస్థానం ఎదుట హాజరుపరిచినట్లు ఏసీబీ అధికారులు తెలిపారు.
⏱ Top Story 👁 11 Views | ⬇️ 0 Downloads
⬅️ Back to Read Article