రూ.8,500 పాస్ రూ.4 వేలకే.. మెట్రో-ఆర్టీసీ ధరలపై కాంగ్రెస్ సర్కార్ యూటర్న్
7tv focus : మెట్రో-ఆర్టీసీ ఉమ్మడి ప్రయాణ పాస్ ధరల విషయంలో తెలంగాణ ప్రభుత్వం వెనక్కి తగ్గింది. ప్రారంభంలో భారీ ధరలతో అందుబాటులోకి తీసుకొచ్చిన కామన్ ట్రావెల్ పాస్‌పై ప్రయాణికుల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది. నెలవారీ పాస్ ధర రూ.8,500గా నిర్ణయించడంపై సామాన్య ప్రయాణికులు అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ ధరతో పాస్ తీసుకోవడం కంటే విడివిడిగా టికెట్లు కొనుక్కోవడమే మేలంటూ పలువురు సోషల్ మీడియా వేదికగా విమర్శలు గుప్పించారు. దీంతో ధరలపై పునఃసమీక్షకు దిగిన ప్రభుత్వం తాజాగా భారీగా తగ్గింపులు ప్రకటించింది.అక్టోబర్ 2న హైదరాబాద్ మెట్రో, టీజీఎస్ఆర్టీసీ సంయుక్తంగా కామన్ ట్రావెల్ పాస్‌ను ప్రారంభించాయి. అప్పట్లో రోజువారీ పాస్ ధరను రూ.400గా, నెలవారీ పాస్ ధరను రూ.8,500గా నిర్ణయించారు. అయితే...
⏱ Top Story
👁 8 Views |
⬇️ 0 Downloads