rekha-naik_V_jpg--816x480-4g
7TV Focus News

రేఖా నాయక్ ఇళ్లలో ఈడీ సోదాలు.. రూ.40.96 కోట్ల ధాన్యం కుంభకోణం కేసులో తనిఖీలు

7tv focus : నిర్మల్ జిల్లా ఖానాపూర్ మాజీ ఎమ్మెల్యే, కాంగ్రెస్ నాయకురాలు రేఖా నాయక్ ఇళ్లలో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. శుక్రవారం తెల్లవారుజామున ఏకకాలంలో రెండు చోట్ల తనిఖీలు చేపట్టారు. రూ.40.96 కోట్ల విలువైన కస్టమ్ మిల్లింగ్ రైస్ (సీఎంఆర్) ధాన్యం అక్రమాల కేసులో మనీలాండరింగ్ కోణంపై అధికారులు దర్యాప్తు చేస్తున్నట్లు సమాచారం.రేఖా నాయక్‌కు చెందిన ఖానాపూర్ మండలం సత్తెనపల్లిలోని ఏఆర్ఎస్ ఇండస్ట్రీస్ రైస్ మిల్లులో భారీగా ప్రభుత్వ ధాన్యం మాయమైనట్లు గతంలో పౌరసరఫరాల శాఖ అధికారులు గుర్తించారు. మూడు రబీ సీజన్లకు సంబంధించి ప్రభుత్వం కేటాయించిన ధాన్యంలో 9,639.962 మెట్రిక్ టన్నులు లెక్కల్లో లేకుండా పోయినట్లు తేల్చారు. మాయమైన ధాన్యం విలువ సుమారు రూ.40.96 కోట్లు...
⏱ Top Story 👁 3 Views | ⬇️ 0 Downloads
⬅️ Back to Read Article