రేవంత్ రెడ్డి అబద్ధాలకు బ్రాండ్ అంబాసిడర్..భూములను కాపాడిందే బీఆర్‌ఎస్
7tv focus : ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మియాపూర్ భూముల విషయంలో బీఆర్‌ఎస్ నాయకులపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని మాజీ మంత్రి హరీష్‌రావు విమర్శించారు. రేవంత్ రెడ్డి అబద్ధాలకుబ్రాండ్ అంబాసిడర్ గా నిలిచిపోనున్నారని దుయ్యబట్టారు. సీఎంకు అబద్ధాల్లో ఆస్కార్ అవార్డు ఇవ్వొచ్చని వ్యాఖ్యనించారు.మియాపూర్ భూములు తెలంగాణ ప్రభుత్వానికి చెందినవేనని సుప్రీంకోర్టు వెల్లడించిన నేపధ్యంలో సీఎం రేవంత్ రెడ్డి బీఆర్‌ఎస్ నాయకులపై చేసిన ఆరోపణలను తీవ్రంగా ఖండించారు. అబద్ధాలతో క్రెడిట్ చోరీలకు పాల్పడుతున్నారని విమర్శించారు. మియాపూర్ భూముల విషయంపై సుప్రీం కోర్టు జడ్జిమెంట్ కాపీ కూడా ఇంకా రాకముందే ఆ భూములను అమ్ముకోవాలనే ఆతృత సీఎంలో కనిపించిందని ఆరోపించారు.కేసీఆర్ సీఎం అయ్యాక వైద్యనాథన్ అనే సీనియర్ అడ్వకేట్‌ను నియమించి భూములు ప్రభుత్వానికి దక్కేలా న్యాయపోరాటం...
⏱ Top Story
👁 6 Views |
⬇️ 0 Downloads