రైతు వ్యతిరేక విధానాలను దేశ ప్రజలు ప్రతిఘటించాలి: టి. సాగర్
ఏలూరు, జూలై 4 (7 టీవీ ఫోకస్): కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న వ్యవసాయ, ఆర్థిక విధానాలు దేశ రైతాంగాన్ని తీవ్ర సంక్షోభంలోకి నెడుతున్నాయని అఖిల భారత కిసాన్ సభ (ఏఐకేఎస్) జాతీయ ఉపాధ్యక్షుడు టి. సాగర్ విమర్శించారు. రైతు వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా రైతులు, కార్మికులు, ప్రజాస్వామ్య శక్తులు ఐక్యంగా పోరాటాలు చేపట్టాలని ఆయన పిలుపునిచ్చారు. ఏలూరులోని డీసీఎంఎస్ ఫంక్షన్ హాల్‌లో శనివారం ప్రారంభమైన ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం 23వ రాష్ట్ర మహాసభలను టి. సాగర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విదేశీ వాణిజ్య ఒప్పందాల పేరుతో అమెరికా, బ్రెజిల్, న్యూజిలాండ్, ఆస్ట్రేలియా తదితర దేశాల నుంచి నూనెగింజలు, వంటనూనెలు, పత్తి, మొక్కజొన్న, పాల ఉత్పత్తుల దిగుమతులకు సుంకాలు తగ్గించడం...
⏱ Top Story
👁 5 Views |
⬇️ 1 Downloads