రోళ్ళపాడు ద్వీపం.. భద్రాద్రికి కొత్త పర్యాటక దిక్సూచి
సీతారామ ప్రాజెక్టుతో జలకళ.. రైతు, మత్స్యకార, గిరిజన కుటుంబాలకు ఆశాకిరణం 7టీవీ ఫోకస్, టేకులపల్లి, జూన్ 14: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా టేకులపల్లి మండలంలోని రోళ్ళపాడు గ్రామపంచాయతీ పరిధిలో ఉన్న ప్రకృతి రమణీయమైన రోళ్ళపాడు ద్వీపం భవిష్యత్తులో ప్రముఖ పర్యాటక కేంద్రంగా రూపుదిద్దుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రతిష్ఠాత్మక సీతారామ ఎత్తిపోతల పథకం జలాలతో ఈ ప్రాంతం సరికొత్త జలకళను సంతరించుకుంటుండగా, పర్యాటకం, వ్యవసాయం, మత్స్యరంగ అభివృద్ధికి కొత్త మార్గాలు తెరుచుకోనున్నాయని స్థానికులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. దట్టమైన అటవీ ప్రాంతం మధ్యలో విస్తరించిన జలాశయం, దాని నడుమ ఆకుపచ్చని ద్వీపం ప్రకృతి ప్రేమికులను ఆకట్టుకునేలా ఉంది. ప్రస్తుతం పెద్దగా గుర్తింపు పొందని ఈ ప్రాంతం, సీతారామ ప్రాజెక్టు పూర్తయిన తర్వాత రాష్ట్ర స్థాయి...
⏱ Top Story
👁 5 Views |
⬇️ 0 Downloads