langtang_V_jpg--816x480-4g
7TV Focus News

 లాంగ్‌టాంగ్ ప‌ర్వ‌తంపై మంచు స‌ర‌స్సు.. 

కాట్మాండు 7tv focus : లాంగ్‌టాంగ్ లిరుంగ్ ప‌ర్వ‌తంనేపాల్‌లోనే ఉన్న‌ది. దీని ఎత్తు 7245 మీట‌ర్లు. కాట్మాండుకు ఉత్త‌రాన 45 కిలోమీట‌ర్ల దూరంలో ఉన్న‌ది. ఈ ప‌ర్వ‌తానికి విషాద చ‌రిత్ర ఉన్న‌ది. 2015, ఏప్రిల్‌లో నేపాల్‌ను 7.8 తీవ్ర‌త‌తో భూకంపం కుదిపేసిన విష‌యం తెలిసిందే. అయితే ఆ భూకంపం వేళ లాంగ్‌టాంగ్ ప‌ర్వ‌తంపై ద‌క్షిణం వైపున కొండ‌చ‌రియ‌లు విరిగిప‌డ్డాయి. గ్లేసియ‌ర్‌పై మ‌ట్టిచ‌రియ‌లు విరిగిప‌డ‌డంతో లాంగ్‌టాంగ్ గ్రామం పూర్తిగా నేల‌మ‌ట్టం అయ్యింది. ఆ ఘ‌ట‌న‌లో 300 మంది మృతిచెందారు. ఇక ఈ బుధ‌వారం రోజున చైనా బోర్డ‌ర్ వ‌ద్ద సుమారు 4.4 తీవ్ర‌త‌తో భూకంపం సంభ‌వించింది. నేపాలీ స‌మ‌యం ప్ర‌కారం ఉద‌యం 8.37 నిమిషాల‌కు భూమి కంపించింది. అయితే ఆ స‌మ‌యంలోనే లాంగ్‌టాంగ్ ప‌ర్వ‌తంపై...
⏱ Top Story 👁 8 Views | ⬇️ 0 Downloads
⬅️ Back to Read Article