Untitled_10_43251db78b_V_jpg--625x351-4g
7TV Focus News

లారీని ఢీకొట్టిన కారు.. 

కోయంబత్తూరు 7tv : తమిళనాడులోని కోయంబత్తూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఆగి ఉన్న లారీని ఓ కారు వేగంగా ఢీకొనడంతో ఐదుగురు మృతిచెందారు. ఇందులో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు ఉండటం తీవ్ర విషాదాన్ని నింపింది. ఇవాళ (ఆదివారం) మధ్యాహ్నం పొల్లాచ్చి-పళని జాతీయ రహదారిపై నల్లంపల్లి జంక్షన్ సమీపంలో ఈ ప్రమాదం జరిగింది. అతివేగమే ప్రమాదానికి ప్రధాన కారణమై ఉండొచ్చని స్థానిక అధికారులు ప్రాథమికంగా భావిస్తున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనాస్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు.
⏱ Top Story 👁 5 Views | ⬇️ 0 Downloads
⬅️ Back to Read Article