add
7TV Focus News

లైబ్రరీ, ఫైర్‌స్టేషన్ల ఏర్పాటుకై ఆమరణ నిరాహార దీక్ష

7ytv focus : లక్షెట్టిపేట పట్టణాభివృద్ధి, దీర్ఘకాలిక ప్రజా సమస్యల పరిష్కారం కోసం బొప్పు సతీష్ సోమవారం గాంధీచౌక్‌లో ఆమరణ నిరాహార దీక్షకు దిగారు. పట్టణంలో యువత భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని లైబ్రరీ భవనాన్ని, ప్రమాదాల నివారణకు ఫైర్‌స్టేషన్‌ను తక్షణమే ఏర్పాటు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. పలుమార్లు వినతులు ఇచ్చినా ఫలితం శూన్యం ఈ సందర్భంగా బొప్పు సతీష్ మాట్లాడుతూ.. పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న నిరుద్యోగ యువతకు శాశ్వత లైబ్రరీ లేక ఇబ్బందులు పడుతున్నారని, అలాగే అత్యవసర పరిస్థితుల్లో ఆస్తులు, ప్రాణ నష్టాన్ని నివారించే ఫైర్‌స్టేషన్ లేకపోవడం దారుణమన్నారు. గత కొన్నేళ్లుగా మంచిర్యాల జిల్లా కలెక్టరేట్, లక్షెట్టిపేట తహసీల్దార్ కార్యాలయాల్లో ప్రజావాణి ద్వారా ఎన్నో వినతిపత్రాలు ఇచ్చినా అధికారులు స్పందించలేదని ఆవేదన...
⏱ Top Story 👁 8 Views | ⬇️ 0 Downloads
⬅️ Back to Read Article