images (3)
7TV Focus News

వంద మందికి పైగా ఏజెంట్ల అరెస్ట్

7tv focus : దక్షిణాది రాష్ట్రాల్లో సైబర్ నేరాలకు చెక్ పెట్టేందుకు సైబర్ సెక్యూరిటీ బ్యూరో భారీ ఆపరేషన్ చేపట్టింది. సైబర్ నేరగాళ్లకు మ్యూల్ ఖాతాలు సమకూర్చి, కేవైసీ పత్రాలు అందజేస్తున్న వంద మందికి పైగా ఏజెంట్లను అరెస్ట్ చేసింది. వీరికి దేశవ్యాప్తంగా పలు సైబర్ నేరాలతో సంబంధాలున్నట్టు పోలీసులు గుర్తించారు. నిందితుల నుంచి మ్యూల్ ఖాతాలకు సంబంధించిన డెబిట్ కార్డులు, బ్యాంకు పాస్‌బుక్‌లు భారీగా స్వాధీనం చేసుకున్నారు.ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, తెలంగాణ, తమిళనాడు, కేరళం రాష్ట్రాల్లో సైబర్ సెక్యూరిటీ బ్యూరో ప్రత్యేక సోదాలు నిర్వహించింది. మొత్తం వంద మందికి పైగా ఏజెంట్లను అదుపులోకి తీసుకుంది. దాదాపు రెండు వారాల పాటు ఈ సోదాలు జరిగాయి.
⏱ Top Story 👁 9 Views | ⬇️ 0 Downloads
⬅️ Back to Read Article