వనపర్తి బస్సు ప్రమాదం బాధాకరం: మహేష్ కుమార్ గౌడ్
7టీవీ ఫోకస్, హైదరాబాద్, జూన్ 29: వనపర్తి జిల్లాలో జరిగిన ఆర్టీసీ ఎక్స్‌ప్రెస్ బస్సు ప్రమాదం బాధాకరమని టీపీసీసీ అధ్యక్షుడు, ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ అన్నారు. ప్రమాదంలో గాయపడిన ప్రయాణికులకు మెరుగైన వైద్య సేవలు అందించి, వారి ఆరోగ్య పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని అధికారులను కోరారు. వనపర్తి సమీపంలోని రంగాపూర్ వద్ద జాతీయ రహదారి–44పై ఆర్టీసీ ఎక్స్‌ప్రెస్ బస్సు ప్రమాదానికి గురైన ఘటనపై టీపీసీసీ అధ్యక్షుడు, ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ఈ మేరకు సోమవారం విడుదల చేసిన ప్రకటనలో ఆయన మాట్లాడుతూ, ప్రమాదంలో గాయపడిన ప్రయాణికులకు అత్యుత్తమ వైద్య సేవలు అందించేందుకు సంబంధిత అధికారులు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని సూచించారు. ప్రమాదంలో ఇద్దరు ప్రయాణికులకు...
⏱ Top Story
👁 7 Views |
⬇️ 0 Downloads