images (8)
7TV Focus News

వసంత్ కుమార్ కుటుంబానికి పార్టీ, ప్రభుత్వం అండగా ఉంటాయి

అమరావతి 7tv focus : చిత్తూరు జిల్లా టీడీపీ నాయకుడు చెరుకూరి వసంత్ కుమార్ కుటుంబానికి అండగా ఉంటామని సీఎం చంద్రబాబు నాయుడు భరోసా ఇచ్చారు. బుధవారం వసంత్ కుమార్ కుటుంబ సభ్యులతో ఆయన ఫోన్‌లో మాట్లాడారు. పార్టీలో వివిధ హోదాల్లో పనిచేసిన వసంత్ కుమార్ సేవలను ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు గుర్తు చేసుకున్నారు. ఆయన మృతి బాధాకరమని పేర్కొన్నారు.కుటుంబానికి పార్టీతోపాటు ప్రభుత్వం అండగా ఉంటాయని స్పష్టం చేశారు. మీకు ఎలాంటి ఇబ్బందులు ఎదురైనా తన దృష్టికి తీసుకురావాలని ఈ సందర్బంగా వసంత్ కుమార్ కుటుంబ సభ్యులకు సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు. ఆగస్టు 24వ తేదీన చెరుకూరి వసంత్ కుమార్ గుండెపోటుతో మరణించారు. ఆయన వయస్సు 53 సంవత్సరాలు
⏱ Top Story 👁 15 Views | ⬇️ 0 Downloads
⬅️ Back to Read Article