RJD_V_jpg--816x480-3g
7TV Focus News

విద్యా ప్రమాణాల పెంపునకు సమష్టి కృషి చేయాలి 

7tv focus : విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించడమే లక్ష్యంగా ఉపాధ్యాయులుసమష్టిగా కృషి చేయాలని పాఠశాల విద్యాశాఖ ప్రాంతీయ సంయుక్త సంచాల కులు సోమిరెడ్డి సూచించారు. సోమవారం నారాయణపేట జిల్లా ఊట్కూర్ మండలం చిన్నపోర్ల పీఎం శ్రీ ఉన్నత పాఠశాలలో నిర్వహించిన కాంప్లెక్స్ స్థాయి ఉపాధ్యాయుల సమావేశాన్ని ఆయన సందర్శించారు.ఈ సందర్భంగా రిసోర్స్ పర్సన్లు నిర్వహిస్తున్న శిక్షణ తరగతులను పరిశీలించి, సమావేశం నిర్వహణ తీరుపై సంతృప్తి వ్యక్తం చేశారు. నూతన బోధనా పద్ధతులను తరగతి గదుల్లో అమలు చేస్తూ విద్యార్థుల్లో చదవడం, రాయడం, గణిత ప్రాథమిక నైపుణ్యాలను పెంపొందిం చాలని సూచించారు. వెనుకబడిన విద్యార్థులపై ప్రత్యేక శ్రద్ధ చూపాలన్నారు.
⏱ Top Story 👁 3 Views | ⬇️ 0 Downloads
⬅️ Back to Read Article