gottipati_prakasam_e1131fbd6a_V_jpg--625x351-4g
7TV Focus News

విద్యుత్ శాఖపై ఎల్‌నినో ఎఫెక్ట్.. 

7tv focus : విద్యుత్ శాఖపై ఎల్‌నినో ప్రభావం తీవ్రంగా ఉందని మంత్రి గొట్టిపాటి రవికుమార్ అన్నారు. ఈరోజు(గురువారం) మీడియాతో మాట్లాడుతూ.. వేసవిని తలపించే ఎండల వల్ల 50 మిలియన్ యూనిట్ల మేర అదనంగా విద్యుత్ డిమాండ్ పెరిగిందని తెలిపారు. గత సంవత్సరం ఇదే సమయంలో 240 మిలియన్ యూనిట్ల డిమాండ్ ఉండగా.. ఈసారి 290 మిలియన్ యూనిట్లకు చేరిందని అన్నారు. విద్యుత్ జనరేషన్ కంపెనీలన్నీ పూర్తిస్థాయిలో పనిచేస్తున్నాయని చెప్పారు. థర్మల్ పవర్ స్టేషన్లలో 15 రోజులకు సరిపడా బొగ్గు నిల్వలు ఉంచామని తెలిపారు. కొన్ని సాంకేతిక సమస్యలు వచ్చినా అధిగమిస్తున్నామని అన్నారు. వర్షాలు లేకపోవడంతో హైడల్ విద్యుత్ ఉత్పత్తి పూర్తిగా నిలిచిపోయిందని చెప్పారు.ప్రజలకు, వ్యవసాయానికి, పరిశ్రమలకు ఎటువంటి అవాంతరాలు లేకుండా చూడాలని...
⏱ Top Story 👁 6 Views | ⬇️ 0 Downloads
⬅️ Back to Read Article