Fire_Accident_194c9573e7_V_jpg--625x351-4g
7TV Focus News

విశాఖ పోర్టులో భారీ అగ్నిప్రమాదం.. 

7tv focus : విశాఖ పోర్ట్ ట్రస్ట్‌లో అగ్నిప్రమాదం సంభవించింది. సీ హార్స్ జంక్షన్ సమీపంలోని జె.ఎం. భక్షి కంపెనీ పరిధిలో ఈ ఘటన చోటుచేసుకుంది. నిర్మాణంలో ఉన్న కన్వేయర్ బెల్ట్‌లో అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. దీంతో ఈరోజు (శుక్రవారం) మధ్యాహ్నం 1:45 గంటల సమయంలో మంటలు భారీగా వ్యాపించాయి.భారీగా మంటలు ఎగసిపడటం, దట్టమైన పొగ వ్యాపించడంతో స్థానికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. సమాచారం అందిన వెంటనే విశాఖపట్నం పోర్ట్ ట్రస్ట్ అగ్నిమాపక సిబ్బంది అప్రమత్తమయ్యారు. ఫైర్ ఇంజిన్లతో హుటాహుటిన ఘటనాస్థలికి చేరుకుని మంటలను అదుపు చేసేందుకు చర్యలు చేపట్టారు. అయితే, ఇప్పటివరకు మంటలు అదుపులోకి రాలేదు. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
⏱ Top Story 👁 5 Views | ⬇️ 0 Downloads
⬅️ Back to Read Article