వేర్ల వ్యాపారం మాటున కలప దందా?
7tv focus : ఛత్తీస్‌గఢ్, తెలంగాణ సరిహద్దుల్లోని దుమ్ముగూడెం మండలంతో పాటు ఛత్తీస్‌గఢ్ అటవీ ప్రాంతాల్లో అల్లి చెట్ల వేర్ల సేకరణ పేరుతో భారీ కలప అక్రమ దందా సాగుతున్నట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఔషధ గుణాలున్నాయనే ప్రచారాన్ని ఆసరాగా చేసుకుని కొందరు వ్యాపారులు గిరిజనులతో అడవుల్లోని అల్లి చెట్ల వేర్లు, బెరడు సేకరింపజేస్తూ కోట్ల రూపాయల వ్యాపారానికి తెరలేపినట్లు సమాచారం. చర్ల, దుమ్ముగూడెం మండలాల అటవీ ప్రాంతాలను కేంద్రంగా చేసుకుని ఈ వ్యవహారం సాగుతున్నట్లు తెలుస్తోంది. దుమ్ముగూడెం మండల కేంద్రమైన లక్ష్మీనగరం సంత వ్యాపారులే ఈ దందాను యధేచ్చగా సాగిస్తున్నట్లుగా సమాచారం. ఇది ఇటీవల కాలంలో మరింత జోరు పెరిగింది. అటవీ ప్రాంతాల్లోకి వెళ్లి చెట్ల వేర్లు, బెరడు సేకరించే పనిని స్థానిక...
⏱ Top Story
👁 25 Views |
⬇️ 0 Downloads