fire_V_jpg--816x480-4g
7TV Focus News

వైన్ మార్ట్ స్టాక్ స్టోరేజీలో భారీ అగ్ని ప్రమాదం..

Hyderabadtv 7tv focus : హైదరాబాద్‌లో మరో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. బంజారా హిల్స్ రోడ్ నెం. 11లోని బీఆర్కే న్యూస్ భవనంలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. సెల్లార్‌లో ఉన్న దారువాలా వైన్ మార్ట్ స్టాక్ స్టోరేజీలో ప్రమాదం జరిగి మంటలు చెలరేగాయి. గమనించిన స్థానికులు వెంటనే అగ్ని మాపక సిబ్బందికి ఫోన్‌ చేశారు. సంఘటన స్థలానికి చేరుకున్న ఫైర్‌ సిబ్బంది 11 మందిని కాపాడారు. నాలుగు ఫైర్ ఇంజన్లతో మంటలు ఆర్పుతున్నారు. ఈ ప్రమాదంలో భారీ ఎత్తున మద్యం అగ్నికి ఆహుతైనట్లు సమాచారం. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
⏱ Top Story 👁 11 Views | ⬇️ 2 Downloads
⬅️ Back to Read Article