వ్యాయామం చేసేటప్పుడు ఏదిపడితే అది తింటే ప్రమాదం..
7tv focus : 1. వ్యాయామం చేయడానికి ముందు ప్రొటీన్‌లు ఎక్కువగా ఉండే ఆహారం తీసుకోవాలి. అయితే ఏదైనా ఆహారంగా తీసుకున్న తర్వాత వ్యాయామం మొదలుపెట్టడానికి కనీసం గంటసేపైనా విరామం ఇవ్వాలి. లేదంటే అనవసర సమస్యలు వస్తాయి. వ్యాయామానికి ముందు తీసుకునే ఆహారం కొవ్వులు, పిండి పదార్థాల మిశ్రమంగా ఉండాలి. అరటిపండు, ఉడికించిన గుడ్లు తీసుకుంటే మంచిది. 2. అదేవిధంగా వ్యాయామం తర్వాత కూడా శరీరానికి శక్తి కావాలి. అందుకే వ్యాయామం అయిన తర్వాత గంటలోపు మీకిష్టమైన పోషకాలున్న ఆహారాన్ని తీసుకోవాలి. వ్యాయమం తర్వాత శరీరం అలసిపోతుంది కాబట్టి శక్తి ఎంతో అవసరం. కసరత్తుల వల్ల ఖర్చైపోయిన ఎనర్జీని పొందడానికి వోట్ మీల్, క్వినోవా, గుడ్లు, గ్రీక్ కర్డ్, చికెన్, చేపలు, గింజలు,...
⏱ Top Story
👁 5 Views |
⬇️ 0 Downloads