ola-uber_V_jpg--816x480-4g
7TV Focus News

 శనివారం నుంచి అన్నీ బంద్‌

హైదరాబాద్‌ 7TV Desk : వాహన, డెలివరీ సంఘాల జేఏసీ ప్రకటించింది. వాహన సేవలు, యాప్‌ ఆధారిత డెలివరీ సేవలు నిలిపివేస్తామని శనివారం నుంచి రాష్ట్రవ్యాప్తంగా నిరవధిక సమ్మెకు దిగుతున్నట్టు జేఏసీ వెల్లడించింది. ఆటో, క్యాబ్‌, లారీ తదితర వాహన సేవలు, ఓలా, ర్యాపిడో, ఉబర్‌ ఆధారిత సేవలు, స్విగ్గీ, జొమాటో, జెప్టో, ఇన్‌స్టామార్ట్‌ తదితర డెలివరీ సేవలు అన్నీ బంద్‌ చేస్తామని జేఏసీ నేతలు తెలిపారు. నాంపల్లిలోని ‘గిగ్‌’ కార్యాలయంలో గురువారం 16 సంఘాల నాయకులు సమావేశమయ్యారు. ఈ సందర్భంగా అన్ని సంఘాల జేఏసీ నాయకులు మాట్లాడుతూ.. ఇప్పటివరకు చాలాసార్లు తమ సమస్యలపై ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసినా ప్రయోజనం లేదని ఆవేదన వ్యక్తంచేశారు.
⏱ Top Story 👁 6 Views | ⬇️ 0 Downloads
⬅️ Back to Read Article