శాలిగౌరారం చెరువు నుంచి సాగునీటి విడుదల.. రైతులకు ప్రయోజనం
7టీవీ ఫోకస్, హైదరాబాద్, జూన్ 26: శాలిగౌరారం చెరువు నుంచి పంట పొలాలకు సాగునీటిని భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి, తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామేలు శుక్రవారం అధికారికంగా విడుదల చేశారు. ఈ నీటితో వేలాది ఎకరాల్లో సాగు చేస్తున్న రైతులకు ప్రయోజనం చేకూరనుంది. రైతాంగానికి సాగునీటి కొరత లేకుండా చూడాలనే లక్ష్యంతో శాలిగౌరారం చెరువు నుంచి పంట పొలాలకు నీటిని విడుదల చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా భువనగిరి పార్లమెంట్ సభ్యుడు చామల కిరణ్ కుమార్ రెడ్డి, తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామేలు హాజరయ్యారు. ముందుగా చెరువు వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం, క్రస్ట్ గేట్ల ద్వారా అధికారికంగా సాగునీటిని విడుదల చేశారు. ఈ సందర్భంగా...
⏱ Top Story
👁 8 Views |
⬇️ 0 Downloads