TG_Coucil_4b1cc091a1_V_jpg--625x351-4g
7TV Focus News

శాసన మండలి నుంచి బీఆర్ఎస్ సభ్యుల వాకౌట్

హైదరాబాద్ 7tv focus :  తెలంగాణ శాసనమండలి నుంచి ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ పార్టీ సభ్యులు వాకౌట్ చేశారు. గురువారం మండలి ప్రారంభమైన తర్వాత 22ఎపై చర్చించాలంటూ బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు పట్టుబట్టారు. అందుకోసం వాయిదా తీర్మానాన్ని ప్రతిపాదించారు. ఈ ప్రతిపాదనను శాసనమండలి చైర్మన్ తిరస్కరించారు.దాంతో బీఆర్ఎస్ సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ.. చైర్మన్ పోడియం వద్దకు చేరుకున్నారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ.. పేపర్లు చించి గాలిలోకి ఎగరేశారు. అనంతరం మండలి నుంచి వాకౌట్ చేస్తున్నట్లు ప్రకటించిన బీఆర్ఎస్ సభ్యులు బయటకు వెళ్లిపోయారు.
⏱ Top Story 👁 6 Views | ⬇️ 0 Downloads
⬅️ Back to Read Article