uma_V_jpg--816x480-3g
7TV Focus News

 సమతుల ఆహారంతోనే సంపూర్ణ ఆరోగ్యం సాధ్యం.. సీడీపీవో ఉమ..!

7tv focus : మండల పరిధిలోని భాగ్యనగర్‌ తండా గ్రామపంచాయతీ కార్యాలయంలో మహిళా అభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో 9వ జాతీయ పోషణ మాసోత్సవాలను శనివారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా గర్భిణులు, బాలింతలు, చిన్నారులు, మహిళలకు పోషకాహారం, ఆరోగ్య పరిరక్షణ, వ్యక్తిగత పరిశుభ్రతపై కామేపల్లి ఐసీడీఎస్ ప్రాజెక్ట్ సీడీపీవో కె.ఉమ అవగాహన కల్పించారు. పౌష్టికాహారం ప్రాధాన్యాన్ని వివరిస్తూ ఆరోగ్యకరమైన జీవనశైలిని అలవర్చుకోవాలని ఆమె సూచించారు. తొమ్మిదో జాతీయ పోషణ మాసోత్సవాలకు ముఖ్య అతిథిగా హాజరైన ఐసీడీఎస్ ప్రాజెక్ట్ సీడీపీవో కె.ఉమ మాట్లాడుతూ గర్భిణులు, బాలింతలు, చిన్నారుల ఆరోగ్య పరిరక్షణకు సమతుల్యమైన పోషకాహారం ఎంతో అవసరమని తెలిపారు. ముఖ్యంగా గర్భిణులు పౌష్టికాహారం తీసుకోవడం ద్వారా తల్లి, బిడ్డ ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చని ఆమె...
⏱ Top Story 👁 6 Views | ⬇️ 0 Downloads
⬅️ Back to Read Article