images (10)
7TV Focus News

సాగునీరు ఇవ్వలేం.. వరి పంట వేయొద్దు.. 

నల్గొండ 7TV FOCUS : ఎల్‌నినో కారణంగా ప్రస్తుతం నాగార్జునసాగర్‌ ప్రాజెక్టులో ఉన్న నీరు తాగునీటికే సరిపోతుందని, అంతేకాక పైనుంచి నీరు వచ్చే అవకాశం కూడా లేనందున రైతులు ఎట్టి పరిస్థితుల్లోనూ వరి వేయకుండా ఆరుతడి పంటలు వేసుకునేలా అధికారులు అవగాహన కల్పించాలని రాష్ట్ర మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. ఒకవేళ నాగార్జునసాగర్‌ నిండినప్పటికీ చెరువులు నింపే పరిస్థితి లేదని, ఇప్పటికే బోర్లలో కూడా గ్రౌండ్‌ వాటర్‌ తగ్గిపోతున్నందున కష్టకాలంలో అధికారులు, ప్రజాప్రతినిధులు రైతులకు అండగా నిలబడి ఆరుతడి పంటలు వేసుకునేలా చూడాల్సిన అవసరం ఉందని ఆయన అన్నారు.శనివారం నల్గొండ జిల్లా కలెక్టర్‌ కార్యాలయ సమావేశ మందిరంలో నిర్వహించిన జిల్లా సాగునీటి సలహా మండలి సమావేశానికి ముఖ్యఅతిథిగా హాజరైన మంత్రి మాట్లాడుతూ.....
⏱ Top Story 👁 12 Views | ⬇️ 0 Downloads
⬅️ Back to Read Article