సాగు భూములకు పట్టాలు ఇవ్వాలని రైతుల వినతి
టీ.నర్సాపురం, జూలై 9 (7 టీవీ ఫోకస్): తరతరాలుగా సాగు చేస్తున్న భూములకు చట్టబద్ధమైన యాజమాన్య హక్కులు కల్పించి పట్టాదారు పాస్‌పుస్తకాలు జారీ చేయాలని కోరుతూ టీ.నర్సాపురం మండలంలోని రైతులు గురువారం తహసీల్దార్‌కు వినతిపత్రం సమర్పించారు. టీ.నర్సాపురం మండలంలోని తేడ్లం గ్రామపంచాయతీ పరిధిలోని లింగారావుపాలెం రెవెన్యూ పరిధికి చెందిన సుమారు 200 రైతు కుటుంబాలు దాదాపు 100 సంవత్సరాలుగా సర్వే నంబర్లు 1 నుంచి 45 వరకు ఉన్న భూములను సాగు చేస్తున్నామని తెలిపారు. అయితే ఇటీవల తమకు ఎలాంటి సమాచారం ఇవ్వకుండా ఆ భూములను ఆన్‌లైన్‌లో ఇతరుల పేర్లపై నమోదు చేశారని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రస్తుతం తాము సాగు పనులు చేపట్టేందుకు వెళ్లగా కొందరు తమను అడ్డుకోవడంతో పాటు...
⏱ Top Story
👁 6 Views |
⬇️ 1 Downloads