sarapaka
7TV Focus News

సార‌పాక‌లో ముమ్మరంగా ఓటరు నమోదు

7tv focus : బూర్గంపహాడ్ మండల పరిధిలోని పారిశ్రామికవాడ సారపాకలో ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల్లో పట్టభద్రులను బీఆర్ఎస్ నాయకులు కలుసుకుని ముమ్మరంగా ఓటరు నమోదు కార్యక్రమం చేపట్టారు. శనివారం బ్రిలియంట్ పాఠశాలతో పాటు గాంధీనగర్‌లోని ప్రభుత్వ పాఠశాలల్లో పట్టభద్రుల ఉపాధ్యాయులను కలిసి ఫారం-18 అందించి ఓటరు నమోదు చేసుకోవాలని అవగాహన కల్పించారు. ఓటరు నమోదును త్వరితగతిన చేసుకుని ప్రజాస్వామ్య ప్రక్రియలో భాగస్వాములు కావాలన్నారు. ఈ కార్యక్రమంలో మండల వర్కింగ్ ప్రెసిడెంట్ జలగం జగదీష్, పట్టణ అధ్యక్షుడు కొనకంచి శ్రీనివాసరావు, యూత్ నాయకులు సోము లక్ష్మిచైతన్యరెడ్డి, చల్లకోటి పూర్ణ, చట్టు ఆంజనేయులు, దాసరి మోహన్, పంగి సురేశ్‌ పాల్గొన్నారు.
⏱ Top Story 👁 4 Views | ⬇️ 0 Downloads
⬅️ Back to Read Article