WhatsApp Image 2026-06-19 at 8.20.58 PM
7TV Focus News

సింగరేణిలో వేల కోట్ల అక్రమాలపై విచారణ జరపాలి

హౌస్ కమిటీ లేదా సీబీఐ దర్యాప్తునకు ఆదేశించాలి: ఏలేటి మహేశ్వర్ రెడ్డి 7టీవీ ఫోకస్, మంచిర్యాల, జూన్ 19: సింగరేణి సంస్థలో గత, ప్రస్తుత ప్రభుత్వాల హయాంలో జరిగినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న వేల కోట్ల రూపాయల అక్రమాలపై హౌస్ కమిటీ లేదా సీబీఐతో విచారణ జరిపించాలని బీజేపీ శాసనసభాపక్ష నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి డిమాండ్ చేశారు. సింగరేణి సంపదను పాలకులు దోచుకుంటూ సంస్థను అప్పుల ఊబిలోకి నెడుతున్నారని ఆరోపించారు. సింగరేణిలో జరుగుతున్న అవకతవకలను పరిశీలించేందుకు మంచిర్యాల జిల్లా శ్రీరాంపూర్ గనుల సందర్శనకు బయలుదేరిన బీజేపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల బృందాన్ని పోలీసులు అడ్డుకుని అరెస్టు చేయడాన్ని ఆయన తీవ్రంగా ఖండించారు. అధికారిక అనుమతులతోనే వచ్చినప్పటికీ ప్రభుత్వం పోలీసులను ప్రయోగించి ప్రజాప్రతినిధులను అడ్డుకోవడం ప్రజాస్వామ్య...
⏱ Top Story 👁 8 Views | ⬇️ 0 Downloads
⬅️ Back to Read Article