సింగరేణి జీఎం కార్యాలయంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు
7tv focus : తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే బతుకమ్మ పండుగను పురస్కరించుకుని సింగరేణి కొత్తగూడెం ఏరియా జీఎం కార్యాలయంలో బతుకమ్మ సంబరాలను ఘనంగా నిర్వహించారు. రంగురంగుల పూలతో బతుకమ్మలను అలంకరించి, సంప్రదాయ దుస్తుల్లో మహిళా ఉద్యోగులు ఆటపాటలతో సందడి చేశారు. ఈ సందర్భంగా ఏరియా జీఎం సీహెచ్. వెంకటరమణ మాట్లాడుతూ.. బతుకమ్మ తెలంగాణ ఆడపడుచుల ఆత్మగౌరవానికి ప్రతీకని, మన సంస్కృతి, సంప్రదాయాలకు నిలువెత్తు నిదర్శనమని అన్నారు.ఇటువంటి పండుగలు ఉద్యోగుల మధ్య ఐక్యత, సోదరభావం, ఆత్మీయతను పెంపొందిస్తాయని పేర్కొన్నారు. మన సంస్కృతి, సంప్రదాయాలను భావితరాలకు అందించడంలో బతుకమ్మ వేడుకలు కీలకపాత్ర పోషిస్తాయని తెలిపారు. మహిళా ఉద్యోగులు సంప్రదాయ బతుకమ్మ పాటలు పాడుతూ, ఆటలతో ఉత్సాహంగా పాల్గొనడంతో కార్యాలయ ప్రాంగణం పూల అందాలతో,...
⏱ Top Story
👁 14 Views |
⬇️ 0 Downloads